Thursday, December 12, 2024

Loan app : వేధింపులతో యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 9 : సమాజంలో సైబర్ నేరగాళ్ల బెదిరింపుల పర్వం, లోన్ యాప్స్ వేధింపులు అధికమయ్యాయి… కేవలం రూ.15 వేల లోన్ తీసుకున్నందుకు ఆ వేధింపులు భరించలేక ఓ యువతి శ్రీశైలంలోని శిఖరేశ్వరం నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి శ్రీశైలం సిఐ జి.ప్రసాదరావు ఆధ్వర్యంలో వారి సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి బాలికను సురక్షితంగా చేర్చిన సంఘటన సోమవారం జరిగింది.

సిఐ ప్రసాద్ రావు తెలిపిన వివరాల మేరకు… గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన వెన్నెల అనే యువతి తన తల్లిదండ్రులకు అనారోగ్యం దృష్ట్యా చికిత్స నిమిత్తం లోన్ యాప్స్ ద్వారా రూ.15వేలు అప్పుగా తీసుకున్నది. తీసుకున్న అప్పు రూ.15 వేలు అయితే ఐదు రెట్లు రూ.75 వేలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడంతో వెన్నెల శ్రీశైలమునకు వచ్చి శిఖరేశ్వరం నుంచి అటవీ లోయలోకి దూకింది.

ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అడవిలో గాలించి వెన్నెలను సురక్షితంగా తీసుకువచ్చారు. ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసుల అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలాంటి లోన్ యాప్స్ వేధింపుల వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదని, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని సీఐ ప్రసాదరావు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement