ఆస్పరి మండల పరిధిలోని యాటకల్లు గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాన్ని ఫ్లోరైడ్ లేని గ్రామంగా చేస్తానని పార్లమెంటు సభ్యుడు సంజీవ్ కుమార్ తెలిపారు. గ్రామంలోని ఉన్న 75 సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. బుధవారం యాటకల్లు గ్రామంలో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అన్ని సమస్యలపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగుల విధివిధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు నెలలకోసారి గ్రామాన్ని సందర్శించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి పార్టీ ఆలూరు తాలూకా ఇన్ చార్జి గుమ్మనూరు నారాయణ స్వామి, జిల్లా కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్పిటిసి దొరబాబు, సింగిల్విండో చైర్మన్ గోవర్ధన్, మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు, యాటకల్లు సర్పంచ్ పెద్ద రెడ్డి,మండల స్థాయి అధికారులు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement