కర్నూలు బ్యూరో : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 115 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐలు శివశంకర్, హాజీవలి పాల్గొన్నారు.