Sunday, November 24, 2024

లిక్విడ్‌ ఆక్సిజన్ ప్లాంట్ ను ఆకస్మికంగా పరిశీలించిన జేసీ

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో. లిక్విడ్‌ ఆక్సిజన్ ప్లాంట్ ను ఆకస్మికంగా పరిశీలించారు జేసీ(రెవెన్యూ), ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి.అందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్ లో ఆక్సిజన్ నిల్వ ఎంత ఉంది…ఆక్సిజన్ అవసరం ఎంత, మనం ఎంత వాడుతున్నాం, ఆక్సిజన్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుంది వంటి వివరాలను జిజిహెచ్ సూపర్ డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకుని కరోన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిజిహెచ్ సూపర్ డెంట్ కు జేసీ (రెవెన్యూ) మరియు ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు.ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్పషన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ట్రైల్ రన్ ను పరిశీలించి ఎన్ని పడకలకు ఈ ప్లాంట్‌ నుంచి నేరుగా ఆక్సిజన్‌ను నిరంతరాయంగా సరఫరా చేయవచ్చు వంటి వివరాలను ఏపీఎంఐడిసి సదాశివ రెడ్డిని అడిగి తెలుసుకున్న జేసీ.*ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపర్ డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, ఏపీఎంఐడిసి సదాశివ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement