కర్నూలు – ఒకటో వార్డులో మునిసిపల్ ఎలిమెంటరీ ఉర్దూ స్కూలు,ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు లను వార్డు క్కార్పొరేటర్ పి.షాషావలి గురువారం సందర్శించి, పాఠశాలలో విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అయిన జగనన్న గోరుముద్ద పథకంలో ఉండే రోజువారీ ఆహార పట్టిక(మెనూ)ను పరిశీలించారు. జగనన్న విద్యా దీవెన క్రింద విద్యార్థులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు,డ్రస్స్సులు,షూస్(బూట్లు) మొదలగు వస్తువులు అందరికి తీసుకున్నారా అని విద్యార్ధులను ప్రశ్నించారు.. కాగా, అక్కడి సమస్యలు,ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తెస్తే వాటిని ఎమ్మెల్యే ,మేయర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పి.షేక్షావలి పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement