Saturday, November 23, 2024

ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్

నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ని ఆక్సిజన్ ప్లాంట్ ను ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారుశనివారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇంచార్జి డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ అంకిరెడ్డి లతో కలిసి పరిశీలించారు.అనంతరం ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ కరోన కష్టకాలంలో కరోన బాధితులకు ఆక్సిజన్ ఎంతో అవసరమని ఈ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు విశాఖపట్నం వరకు ఎక్కడా ఏమీ లేవని ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలోని బళ్లారి చెన్నై ప్రాంతాలనుండి సరఫరా చేసుకుంటున్నామని ఇది చాలా కష్టతరంగా ఉన్నందున మన జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో ఉన్నామన్నారు కర్నూల్ లో ఒక ప్లాంట్ నంద్యాల పట్టణంలో కూడా ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మరొక ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయిస్తామన్నారు అని నంద్యాల పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ల దగ్గర ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నావ్ అన్నారు నంద్యాల పట్టణంలో కూడా ఆస్పత్రి ఆవరణంలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ నంద్యాల తహసీల్దార్ రవికుమార్ ఆసుపత్రి సూపర్డెంట్ విజయ్ కుమార్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement