కర్నూలు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్ జి. వీరపాండియన్. ప్రభుత్వ ఆదేశాల జిల్లాలో హెల్త్ వర్కర్స్ & ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్ప్రతిలోని ఓల్డ్ గైనిక్ విభాగంలో కలెక్టర్ జి. వీరపాండియన్‌కు కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ జి. సాయిప్రసాద్ కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. అనంతరం రాష్ట్ర ఇంధన శాఖ ఎక్స్-అఫిషియో స్పెషల్ సీఎస్ మరియు కర్నూలు జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ జి.సాయిప్రసాద్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంతకు ముందు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిజిహెచ్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డా.భగవాన్ దాస్, డిఎంహెచ్ఓ డా.రామగిడ్డయ్య, డి.ఐ.ఓ. డా.విశ్వేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.
కరోనా టీకా వేయించుకున్న కలెక్టర్ వీరపాండియన్
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement