కర్నూల్ – ఆత్మకూరు పురపాలక సంఘం వార్డు సచివాలయం – 4 లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆకస్మికంగా తనికీ చేశారు. ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో ఎంతమంది ఏఎన్ఎం, ఆశాలు, వాలింటర్ లు ఉన్నారని, వారిలో 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎంతమంది అంటూ వివరాలు సేకరించారు. . ఫ్రెంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు ఎంతమంది ఉన్నారని,… ఇప్పటికీ ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారనే వివరాలను డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సిబ్బందితో మాట్లాడుతూ 45 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని….వ్యాక్సిన్ పై వాలింటర్ లు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ టీకా వేయించుకోండి- కరోనా వైరస్ బారి నుండి కాపాడుకోండి, కోవిడ్ టీకా పూర్తిగా సురక్షితం అని, అనుమానాలు, అపోహలు లేకుండా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని విస్తృత ప్రచారం చేయాలన్నారు. రోజువారీగా వాలెంటర్ల్లు టార్గెట్ పెట్టుకొని 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయించేలా చూడాలన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చాలా తక్కువగా ఉందని, ప్రతి రోజు 500 మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో సరిగ్గా పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. షాపుల్లో చాలామంది మాస్క్ వేసుకోవడం లేదు…భౌతిక దూరం పాటించడంలేదని… షాపు యజమానులతో మీటింగ్ పెట్టుకొని షాపుల్లో మాస్క్ వేసుకోవాలని, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట ఆత్మకూరు పురపాలక సంఘం కమిషనర్ డి.వెంకటదాసు, ఆత్మకూరు డిఎస్పి శృతి, ఆత్మకూరు తహసీల్దార్, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement