Wednesday, November 20, 2024

జగనన్న వెలుగు పథకం తో పల్లెల్లో పట్టణాల్లో వెలుగులు.

కర్నూలు, – గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వీధి దీపాల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు జగనన్న పల్లె వెలుగు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ దిశగా వీధి దీపాల సమస్య ఎక్కడ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, ఈ ఓ పి ఆర్ డి లు, ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జగనన్న పల్లె వెలుగు వీధి దీపాల నిర్వహణ బదలాయింపు కార్యక్రమం పై సర్పంచులు, ఎంపీడీఓలు, ఈ ఓ పి ఆర్ డి లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ హాజరయ్యారు. డిపిఓ ప్రభాకర్ రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ గ్రామ, పట్టణలలో వీధిలైట్లు వెలగక పోయిన….రిపేర్ వచ్చిన వెంటనే మరమ్మతులు చేసి వీధి దీపాలు వెలిగేల చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీ లకు కలదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అందులో ప్రధానంగా శానిటేషన్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్ పై వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తమకు ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. ప్రతి ఊరు, పట్టణాన్ని, శుభ్రంగా ఉంచుకోవాలి… శుభ్రంగా లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామం, పట్టణాలలో డ్రైనేజీ లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి క్లీన్ గా ఉంచుకోవాలి అన్నారు. గ్రామ, పట్టణాలలో ఎక్కడ త్రాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా త్రాగునీటి సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. వీధి లైట్లు వెలగడం లేదు… గ్రామంలో పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తే పంచాయతీ కార్యదర్శుల పై ఖచ్చితంగా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement