Monday, November 25, 2024

Kurnool : ఘనంగా సీఎం జ‌గ‌న్‌ జన్మదిన వేడుకలు

ఆలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయం నందు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నియోజకవర్గ ఇన్ చార్జి నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, హాస్పిటల్ నందు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2024లో కూడా ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కంకణ బద్దులై పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుని, 175 స్థానాలు గెలిపించే సామర్థం గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సొసైటీ చైర్మన్ గోవర్ధన్, సొసైటీ సీఈవో అశోక్ ఆధ్వర్యంలో సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు
సీఎం జ‌గ‌న్ పుట్టినరోజు సందర్భంగా సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, సొసైటీ సీఈవో అశోక్ నాయుడు ఆధ్వర్యంలో మంత్రి గుమ్మనూరు జయరాం, వైసిపి ఆలూరు తాలూకా ఇన్ చార్జి గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఆస్పరి సర్పంచ్ మూలింటి.రాధమ్మ, కేడీసీసీ బ్యాంక్ జిల్లా డైరెక్టర్ రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. ముందుగా ఆస్పరి స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి మంత్రి గుమ్మనూరు జయరాం గజమాలను వేశారు. అనంతరం 64 లక్షలతో అంబేద్కర్ సర్కిల్ నందు వేసిన సీసీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి 80 లక్షల రూపాయలతో నిర్మించిన ఆస్పరి గ్రామ సచివాలయం 1వ సచివాలయంను ఆస్పరి సర్పంచ్ మూలింటి రాధమ్మ, 2వ సచివాలయంను ఎంపీపీ సుంకర ఉమాదేవి ప్రారంభించారు. అనంతరం అభినందన సభలో మంత్రి గుమ్మనూరు సొసైటీ చైర్మన్ గోవర్ధనను సన్మానించారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి దొరబాబు, మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు, మండల కన్వీనర్ పెద్దయ్య, పురుషోత్తమ రెడ్డి, ఆస్పరి మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు వైసీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement