Friday, November 22, 2024

చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన…… జిల్లా ఎస్పీ

కర్ప్యూ సమయంలో పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి.

కరోనా కట్టడి కి కర్ప్యూను పటిష్టంగా అమలు చేయాలి.

వాహనాల రాక, పోకలు లేకుండా నియంత్రించాలి.

కర్ప్యూ సమయంలో గూడ్స్ (నిత్యవసర), అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించాలి.

కర్నూలు, – . కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి దినం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న నేపథ్యంలో గురువారం అంతరాష్ట్ర సరిహద్దులో ఉన్న సుంకేశుల చెక్ పోస్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆకస్మిక తనిఖీ చేసి కర్ఫ్యూ ఆంక్షల అమలును పరిశీలించారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో అనుమతుల మేరకే అత్యవసర వాహనాలను అనుమతించాలన్నారు. ఇతర వాహనాలను అనుమతించారాదన్నారు. అనవసరంగా ప్రజలు బయట తిరగకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కర్ఫ్యూ వేళల్లో సిబ్బంది చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలపై దిశానిర్ధేశం చేశారు. ప్రజా రవాణా మాత్రం ఉదయం 6 గంటల నుండి మధ్యహ్నాం 12 గంటల వరకు మాత్రమే అనుమతించాలని సూచించారు.

- Advertisement -

జిల్లా ఎస్పీ తో పాటు కోడుమూరు సిఐ శ్రీధర్ , గూడురు పి ఎస్ ఐ మమత ఉన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement