కల్లూరు – వామపక్ష పార్టీలు, రైతు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు కల్లూరులో బంద్ ను పాటించారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద సిపిఎం సిఐటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలోజరిగిన నిరసన కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. బంద్ సందర్భంగా కార్మికులు కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుండి భారీ ర్యాలీ గా అక్కడకు చేరుకుని గంట సేపు రాస్తారోకో నిర్వహించారు ఈసందర్భంగా సిపిఎం సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ యస్ రమణమూర్తి ఎ గోవిందు బి అయ్యస్వామి మాట్లాడుతూ బిజెపి అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ లో ప్రజలు వ్యాపారస్తులు కార్మికులందరూ బంద్ లో స్వచ్చందంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ బంద్ లో సిపిఎం నాయకులు దావీదు యంసి ఆనంద్ కిషన్ ఆంజనేయులు దేవేంద్ర గోవిందు శ్రీనివాస ఆటో యూనియన్ నాయకులు నాగరాజు యస్ ఖాదర్ భాషా జేమ్స్ రంగన్న వెంకటేశ్వర్లు మాలిక్ సెంటర్ హమాలీ యూనియన్ ఎస్టేట్ హమాలీ మార్బుల్ పాలిష్ హమాలీ యూనియన్ నాయకులు ఐరాజు రమేష్ నాయుడు అంకన్న శ్రీనివాసులు మద్దిలేటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement