కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో : కడప సబ్ రిజిస్ట్రార్ కె.శ్యామలాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ పీజీఎస్ కళ్యాణి ఉత్తర్వులు జారీ చేశారు. శ్యామలాదేవిపై కొన్ని ఆరోపణల కారణంగా ఆమెను కర్నూలు రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే, బదిలీ అయిన పోస్టులో ఆమె ఇంకా విధుల్లో చేరలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం కారణంగా ఆమెను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement