నందికొట్కూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న జగనన్న చేదోడు పథకం కళ్లు గీత కార్మికులకు వర్తించదా?, రాష్ట్రంలో కళ్లు గీత కార్మికులు చేతి వృత్తి కార్మికులు కాదా అంటూ జై గౌడ్ ఉద్యమ సంఘం రాయలసీమ అధ్యక్షులు జి మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఈరోజు పట్టణంలోని జైగౌడ్ ఉద్యమం కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో రాయలసీమ అధ్యక్షులు జి.మహేష్ గౌడ్,రాయలసీమ అధికార ప్రతినిది జవ్వాజి చంద్ర శేఖర్ గౌడ్, రాయలసీమ మీడియా ఇన్చార్జి పిట్టా ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైకాపా ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతుల్లో చూపించలేని ప్రభుత్వం అని దేశంలోనే అసమర్ధ పాలన పాలిస్తున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.
గత ప్రభుత్వం గీత వృత్తిదారుకు పనిముట్ల నిమిత్తం ఆదరణ పథకం కింద ప్రతి ఏడాది రూ. 10 వేలు ఇచ్చేవారని ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని వారు తెలిపారు. గౌడ కులస్తులు ఓట్లు వెయ్యందే 151 సీట్ల మెజారిటీతో గెలుస్తారు అని వారు ప్రశ్నించారు. కంటి తుడుపు చర్యగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కేవలం కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లను నియమించారే గానీ ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా గౌడ కులస్తుల ను గుర్తించి తక్షణమే జగనన్న చేదోడు పథకం కింద గీత కార్మిక వృత్తి దారులను చేర్చాలని, కార్పొరేషన్లకు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రం మొత్తం జై గౌడ్ ఉద్యమం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గౌడ్, యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకటేష్ గౌడ్, నందికొట్కూరు మండల అధ్యక్షులు జవ్వాజి సురేష్ గౌడ్, మండల కోశాధికారి భీమ్ గౌడ్, పిట్టా రాజేష్ గౌడ్ ,తాలూకా కోశాధికారి వి.లక్ష్మీ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..