కర్నూలు – రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు/ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రేపు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, కర్నూల్ నగరపాలక సంస్థ బి.వై రామయ్య లు బుధవారం విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను సీఎం సెక్యురిటితో కలిసి పరిశీలించారు.అందులో భాగంగా నేడు ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ బయట వైపు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ రిబ్బన్ కట్, జ్యోతి ప్రజ్వలన చేసే ప్రదేశాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే కర్నూల్ ఎయిర్పోర్ట్ పోస్టల్ స్పెషల్ కవర్స్ ఆవిష్కరణ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా ఎయిర్ పోర్టు ఆవిష్కరణ శిలాఫలకం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ బయటి వైపు ఉన్న జాతీయ పతాకం పాయింట్ ను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, అడిషనల్ ఎస్పీ గౌతమి శాలిని, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డ్వామా పిడి అమర్నాథరెడ్డి, సమాచార శాఖ ఉపసంచాలకులు పి.తిమ్మప్ప, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున్, తిప్పే నాయక్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement