Friday, November 22, 2024

రాయలసీమపై సియం జగన్ ప్రత్యేక దృష్టి….

కోసిగి మండలం పరిధిలోని కందుకూరు గ్రామ సమీపంలో గల ఆర్,డి,ఎస్ ఆనకట్ట వద్దనుండి రూ. 1950 కోట్లతోఆర్,డి,ఎస్, కుడికాలువ నిర్మాణం పనుల కు త్వరలో శ్రీకారం చుట్ట నున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ మురలినాథ్ రెడ్డి తెలిపారు.బుదవారం వైసీపీ రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి,కోసిగి ఇంచార్జ్ మురళీరెడ్డి ,అధికారుల బృందంతో కలసి పనులు ప్రారంభమయ్యే ఆర్,డి,ఎస్, ఆనకట్ట ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ అభివృద్ధే ధ్యేయంగా సియం జగన్మోహన్ రెడ్డి ముప్పైవేల కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని,ఆ నిధుల ద్వారానే బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణ ట్రిబ్యునల్ కమిటీ అదేశాల మేరకు రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) నుండి కుడి కాలువ నిర్మాణం కోరకు దాదాపు 1950కోట్లతో 165కిలోమీటర్ల మేర నాల్గు రిజర్వాయర్లలకు నాల్గు లిఫ్టు ఇరిగేషన్ ద్వారా దాదాపు వేల ఎకరాలకు సాగునీరు అందివ్వడం జరుగుతుందన్నారు. కోసిగి మండలంకు 0.5, పెద్ద కడుబూరు మండలంకు 0.75 టియంసిలు నీళ్లు వాడుకోవచ్చని , మురళీనాథ్ రెడ్డి తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధ్యక్షతన జలవనరుల శాఖ మంత్రీ జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు జిల్లా మంత్రులతో త్వరలో ఆర్,డి, ఎస్ కుడి కాలువ పనులు ప్రారంభిస్తారని తెలిపారు.కాగా కొన్ని దశాబ్దాల కల నేడు సాకారం కానున్నదని రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా సియం జగనన్న,కుఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జలవనరుల శాఖ యస్ఈ శ్రీరామచంద్ర మూర్తి,ఈఈ భాస్కర్ రెడ్డి, నాగార్జున కంపెనీ అధికారులు బిజెపి రెడ్డి, ప్రణీత్,అనిరుధ్ నాలుగు మండలాల వైసీపీనాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement