నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 3 ప్రభ న్యూస్ : దోమల కోసం వేసిన పొగ మంటగా మారి గుడిసె ని అంటుకొని అందులో ఉన్న 86 గొర్రెలు సజీవ దహనమై చనిపోయిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని పెద్ద కందుకూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.పట్టణంలోని పెద్ద కందుకూరు రోడ్డులో ఉన్న బృందావన్ కాలనీ వెంచర్ సమీపంలో ఘోరం జరిగింది. గొర్రెలకు దోమలు కుడతాయని వేసిన పొగ నిప్పుగా మారిపోయి ప్రమాదవశాత్తు గుడిసె మొత్తం కాలిపోవడంతో అందులోని 86 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.
రాత్రి సమయంలో గొర్రెలకు దోమలు కుట్టకుండా గొర్రెల యజమాని మిట్టపల్లి కృష్ణ య్య పొగ పెట్టడంతో ప్రమాదవశాత్తు గుడిసె అంటుకొని కొట్టంలో ఉన్న 86 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అది కాలుతున్నప్పుడు ఆ బయటకు గొర్రెలు చేసిన ఆర్తనాధము అంతా ఇంతా కాదని చుట్టుపక్కల ప్రజలు పేర్కొంటున్నా రు. అంతా జరిగిన తర్వాత బాధితులు వచ్చి మంటలు ఆర్పి అందులో ఉన్న గొర్రెల కబేళాలను బయటికి తీశారు.
మిట్ట కృష్ణయ్య మాట్లాడుతూ… తాము కేవలం వాటి మీద జీవనాధారం చేస్తున్నామని తెలిపారు. మరణించిన గొర్రెల విలువ సుమారు 12లక్షల రూపాయలు ఉంటుందని, మమ్మల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.