Tuesday, November 26, 2024

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు ఏపీజేఎఫ్ వినతి..
కర్నూలు :
ఉమ్మడి జిల్లాలోని కర్నూలు, నంద్యాలలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు ఉన్న జర్నలిస్టులకు గృహలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ కు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఎం.సాయికుమార్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. తాను కర్నూలు జిల్లాలో కలెక్టర్ గా పని చేసిన హ‌యాంలో గణేష్ నగర్ లో, జగన్నాథ్ గట్టు వద్ద కొంతమంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీరిలో ఇల్లు నిర్మించుకొని వారు ఎవరైనా ఉంటే… వారికి ఇల్లు మంజూరు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డిలకు సూచించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు లేని వారికి తక్షణమే స్థలాలు మంజూరు చేయాలని ఏపీ జేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. అలాగే అర్హులైన వారందరికీ జగనన్న గృహ నిర్మాణం పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టి సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టినట్లు అజయ్ జైన్ హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం నాయకులు ఉరుకుందప్ప, సుదర్శన్, సుధాకర్, రాఘవేంద్ర గౌడ్, ఇస్మాయిల్, ఫోటోగ్రాఫర్ సుధాకర్, ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement