నందికొట్కూరు : ప్రతి ఏడాది రైతు సంఘం వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంతరాష్ట్ర స్థాయి పాలబండ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగద్గురు వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల శ్రీ గోవిందమాంబ వార్ల కల్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలోని జీవన జ్యోతి పాఠశాల వద్ద అంతరాష్ట్ర స్థాయి న్యూ కేటగిరి పాలబండ, -4, 4 పళ్ళ లోపు పాల బండలాగుడు పోటీలు నిర్వహించారు. అంతరాష్ట్ర స్థాయి న్యూ కేటగిరి బండలాగుడు పోటీల్లో గెలుపొందితే మొదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.40 వేలు, మూడవ బహుమతి రూ.30 వేలు, నాలుగవ బహుమతి రూ.20, ఐదవ బహుమతి రూ.15 వేలు, ఆరవ బహుమతి రూ.10 వేలు, ఏడవ బహుమతి రూ. 8వేలు, ఎనిమిదవ బహుమతి రూ.5 వేలు, తొమ్మిదవ బహుమతి రూ.4 వేలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి హాజరై బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి 17 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మంగళవారం ఉదయం నుండి హోరా హోరీగా ఈ పోటీలు జరుగుతున్నాయి. పోటీలు వీక్షించేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీగా హాజరయ్యారు. చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కస్టమ్స్ అధికారి వేల్పుల ఆనంద్ కుమార్ లు ఎడ్ల యజమానులను శాలువాతో సన్మానించి మెమోంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహా రెడ్డి, కస్టమ్స్ అధికారి వేల్పుల ఆనంద్, బ్యాంకు రవి కుమార్, ఎస్సై వెంకట రెడ్డి, అల్వాల రామ్మూర్తి, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, రాజశేఖరప్ప, నాగ రంగం, కౌన్సిలర్ లు నాయబ్, లాలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement