Friday, November 8, 2024

Kurnool : జిల్లాలో భారీ వర్షం నమోదు..

పలుచోట్ల పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
హంద్రీ నదికి భారీగా వరద
కోసిగిలో చెరువకు గండి
రూ.20లక్షల పంట నీళ్ల పాలు

కర్నూలు జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో అనేకచోట్ల వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా వేదవతి పొంగిపొర్లడంతో కర్నూలు, బళ్ళారి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కోసిగిలో చెరువుకు గండిపడంతో సుమారు రూ.20లక్షల పంట నీళ్ల పాలైంది.

తీవ్ర నష్టం వాటిల్లింది. హొళగుంద మండల పరిధిలోని హగరి, వేదవతి నదిపై పొంగిపొర్లుతున్న వరద నీరు…. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కౌతాళం మండలంలో రాత్రి భారీ వర్షం మూలంగా ఉపరాల్ గ్రామంలో వంకలు భారీగా పొంగిపొర్లుతున్నాయి. పత్తికొండలో భారీ వర్షం చిన్నహుల్తిలో హంద్రీ నిండుకుండలా పారుతూ గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా వరదనీరు తరలివెళ్తుంది.

పశ్చిమ ప్రాంతంలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి…
మంత్రాలయం మండలంలో 189.8 మీ.మీ, కోసిగి- 96.2, కౌతాళం- 66.4, పెద్దకడుబూరు- 55.6, ఆదోని 48.2, గోనెగండ్ల- 44.2, హొళగుంద- 42.8, నందవరం- 14.6, యెమ్మిగనూరు- 9.6, డివిజన్ మొత్తం 567.4 మి.మీ నమోదైంది. వాస్తవంగా డివిజన్ సగటు వర్షపాతం 63.0 మీ.మీ కావడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement