Friday, November 22, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షం.. నీట మునిగిన పంటలు…

కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల మూలంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాజెక్టులు నిండుకున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. మరోవైపు కురిసిన వర్షాల మూలంగా ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టులకు వరద నీరు చేరుకుంది. దీంతో నిండుకున్న ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువ‌కు విడుదల చేశారు.

అవుకులో నీట మునిగిన పంటలు
అవుకు మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎత్తిపోత ద్వారా అవుకు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వ‌చ్చి చేరుతోంది. కునుకుంట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఇళ్ళలోకి నీరు చేరింది. వర్షపు నీరు వందలాది ఎకరాల ను ముంచెత్తింది. ముఖ్యంగా పొగాకు, మిరప, పత్తి, జొన్న పంటల నష్టం వాటిళ్లింది. కొండమీద గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి.

గాజుల దిన్నె నుంచి నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల
కర్నూలు జిల్లాలో భారీ వర్షం మూలంగా గాజులదిన్నె ప్రాజెక్ట్ కు వర్ధనీరు వచ్చి చేరుకుంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 4 గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని హంద్రి నదిలోకి విడుద‌ల చేశారు. గాజులదిన్నేకు ఇన్ ప్లో 21వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా,
20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలవుతుంది. హంద్రి నది దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement