Tuesday, November 26, 2024

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు.. 12 గేట్లు ఎత్తివేత‌

కర్నూలు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతుండ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై జలాశయం 12 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా… ప్రస్తుతం నీటి మట్టం 1632.85 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 105.186 టీఎంసీలుగా కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 69,124 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 60,206 క్యూ సెక్కులుగా నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement