Friday, November 22, 2024

సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద.. 19 గేట్ల నుంచి నీటి విడుదల

ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా సుంకేసుల ప్రాజెక్టుకు వ‌రద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో సుంకేసుల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేసుల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1.09 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. సుంకేసుల పూర్తిస్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.81 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement