Friday, November 22, 2024

శ్రీశైలం జలాశయానికి భారీ వరద… పది గేట్లు ఎత్తివేత

కర్నూల్ : శ్రీశైల జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. స్థానికంతో పాటు ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ, తుంగభద్ర పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఈ సీజన్ లో ఊహించిన దానికన్నా శ్రీశైల జలాశయం కు భారీ వరద చేరుకుంటుంది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంకు 1.19 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజీ నుంచి 1, 03,400 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 3750 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,32,640 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో జలాశయంకు చెందిన 12 క్రస్ట్ గేట్లలో 10 క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరా ఎత్తి 5,67,960 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 30,706 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కులు విడుదలవుతుంది. శ్రీశైల జలాశయ నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.80 అడుగులు, జలశయ నీటిని నీటి నిల్వలు 215 టీఎంసీలు, ప్రస్తుతం అదే స్థాయిలో నీటి నిలువలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement