Friday, November 22, 2024

శ్రీశైలానికి భారీగా వరద… ఏడు గేట్లు ఎత్తివేత

శ్రీశైల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. తుంగభద్ర, జూరాల నుంచి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో జలాశయానికి మధ్యాహ్నం ఒంటి గంటకు 2.43.789 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జలాశయం నుంచి 2,14,523 క్యూ సెక్కుల నీరు దిగువకు వెళుతుంది. ఇందులో ఏడు స్పిల్వె గేట్ల ద్వారా 1,96,203 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్ కు విడుదల చేస్తుండగా, ఇక ఏపీ కుడి విద్యుత్ కేంద్రం నుంచి 31,284 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కులు విడుదలవుతుంది. వీటితోపాటు ఏపీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, తెలంగాణ పరిధిలోని కల్వకుర్తికి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైల జలాశయ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 884.90 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యము 215 టీఎంసీలు. అదే స్థాయిలో నీటిని నిలువ చేశారు. శ్రీశైలం ఏపీ విద్యుత్ కేంద్రంలో 14.41 మెగా యూనిట్ల విద్యుత్ చేస్తుండగా, ఎడమ విద్యుత్ కేంద్రంలో 17.76 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే సమయంలో జూరాల నుంచి శ్రీశైలంకు 1.40 లక్షల క్యూసెక్కుల నీరు. సుంకేసుల నుంచి 1.03 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement