తుగ్గలి : కర్నూల్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు ఉదయం గుంతకల్ కు వెళ్లే డెమో ట్రైన్ (07292) సమయాన్ని మార్చాలని గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ కు శనివారం ఎంపీ టీజీ వెంకటేష్ లేఖ రాశారు. గతంలో డెమో రైలు (07292) కర్నూల్ నుండి ఉదయం 8.20 గంటలకు బయలుదేరుతూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆ డెమో రైలు (07292) ప్రతిరోజు ఉదయం9.40 గంటలకు కర్నూలు నుండి గుంతకల్ కు బయలుదేరుతుంది. దీంతో కర్నూల్ నుండి వెల్దుర్తి, డోను, తుగ్గలి, పత్తికొండ, మద్దికేర మండలాలకు వెళ్లే ప్రయాణికులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ఈ సమయాన్ని మార్చాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను కోరారు. స్పందించిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రయాణికులు, ఉద్యోగుల, విద్యార్థుల, శ్రేయస్సుకోసం ఆ డెమో ట్రైన్ ఉదయం 8. 20 గంటలకు కర్నూలు నుండి గుంతకల్ కు బయలుదేరే విధంగా డెమో రైలు(07292) సమయాన్ని మార్చాలని గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ కు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ లేఖ రాశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement