ఆలూరు : ఆలూరు మండలంలోని పెద్దహోతూరు గ్రామంలో శుక్రవారం ఉచ్చీరప్పతతా గాలిగోపురం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచ్చీరప్పతతా దేవాలయంలో మంత్రి స్వామి వారిని దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభ నుంచి మంత్రి మాట్లాడుతూ… ఉచ్చీరప్పతతా గాలిగోపురం భూమి పూజకు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే దాదాపు కోటి రూపాయలు వ్యయం అంచనాతో నిర్మాణం చేపట్టడం చాలా గొప్ప విషయమని తెలిపారు. నా వంతు సహకారంగా రూ. 5లక్షలు విరాళంగా ఇస్తానని గాలిగోపురం నిర్వాహకులకు అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉచ్చీరప్పతతా గాలిగోపురం నిర్మాణం కోసం ఆలూరు జడ్పీటీసీ ఏరురూ శేఖర్ రూ.25వేలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, మండల జడ్పీటీసీ ఏరురూ శేఖర్, గ్రామ సర్పంచ్ పి.లక్ష్మన్న, ఎంపీటీసీ-2 దేవరాజు, మాజీ జడ్పీటీసీ రాంభీ నాయుడు, మండల కన్వీనర్ వీరేష్, నాయకులు శ్రీను, సూరి, వైస్సార్సీపీ నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement