జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు సీపీఎస్ రద్దు, సకాలంలో జీతాలు డీ ఏ లు మంజూరు చేయాలని రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా పది స్పాట్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు పి.గోకారి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… ఉపాద్యాయులు, ఉద్యోగులకు కల్పిస్తామన్న సౌకర్యాలను అధికారంలోకి వచ్చాక విస్మరించడం తగదన్నారు. సీపీఎస్ ను రద్దు చేయాలని, పీఆర్సీలోని అసంబద్ధ ఉత్తర్వులను సరిచేయాలని, కేజీబీవీలకు టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంఛార్జి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంఛార్జి ఏపీపీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ రావు, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్, ఏపీటీఎఫ్:257 జిల్లా అధ్యక్షులు శివయ్య, బీటీఏ జిల్లా అధ్యక్షులు భాస్కర్ లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఫ్యాప్టో నిరసన కార్యక్రమానికి ఆర్ యూ పి పి, ఏపీ పి ఇ టి & పిడిఎస్ అసోసియేషన్స్ తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని రఘు, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్యాప్టో నిరసనలో అధిక సంఖ్యలో కర్నూలు – నంద్యాల జిల్లా ఉపాధ్యాయులకు, సోదర సంఘాలకు ఏ పిటి ఎఫ్1938 జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ ధన్యవాదములు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement