Friday, November 22, 2024

క‌ర్నూలు జిల్లాలో మొబైల్ గేమ్స్ పేరుతో మోసం

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో మొబైల్ గేమ్స్ పేరుతో మోసం జ‌రిగింది. కొత్త ఫీచ‌ర్లు ఉన్నాయంటూ ప‌లువురి ద‌గ్గ‌ర డ‌బ్బుల వ‌సూళ్ల‌కు పాడ్ప‌డారు మోస‌గాళ్లు. ఫ్రీఫైర్‌లో సీనియర్‌ ప్లేయర్లమని, తమ వద్ద కొత్త వెపన్స్‌, స్కిన్‌ లెవెల్స్‌ ఉన్న ఐడీలు ఉన్నాయని యువకుల్ని నమ్మించారు. సోషల్ మీడియాలో పోస్టులు చూసి నిజమేనని నమ్మారు. ఆశతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. వాటి కోసం రూ.6 వేల నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు.

అకౌంట్ పాస్‌వర్డ్ చెప్పాలంటే ముందు సగం డబ్బులు చెల్లిస్తే ఐడీ.. పూర్తి డబ్బులు చెల్లించాక పాస్‌వర్డ్ చెబుతామని నమ్మించారు. ఈ ఆశతో యువకులు సగం డబ్బును యాప్‌ల ద్వారా డబ్బులు చెల్లించారు. ఐడీ వచ్చాక పాస్‌వర్డ్‌ తెలుసుకునేందుకు ఫోన్‌ చేయగా ఆ ఫోన్ నంబర్ స్విఛాఫ్‌ చేశారు. అప్పుడు వారికి అనుమానం వచ్చింది. ఫోన్ స్విచ్ఛాప్ రావ‌డంతో చేసేదేమీ లేక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement