Saturday, November 23, 2024

AP | మాజీ ఎమ్మెల్యే భూకబ్జా.. సీఎం దృష్టికి తీసుకెళ్తం: ఎంపీ శబరి

నంద్యాల బ్యూరో, (ప్రభ న్యూస్) : గ‌త‌ వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలకు పాల్పడ్డారని.. నంద్యాల పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలోని జగన్నాధ గట్టు ప్రాంతంలో దాదాపు 79 ఎక‌రాల భూమిన కబ్జా చేశార‌ని ఎంపీ శబరి అన్నారు. ఆదివారం జగన్నాథ గట్టు పరిసర ప్రాంతంలో బాధితులతో వెళ్లి కబ్జాకు గురైన భూములను పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశం మాట్లాడుతూ… జగన్నాథ్‌ గట్టు పరిసర ప్రాంతంలోని సర్వే నంబర్‌ 139లో అనేక అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. జగన్నాథ గట్టు దగ్గర 79 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. తడకనపల్లికి వెళ్లే రహదారిని మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించుకుని లక్షీ పురం గ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.

రెవిన్యూ అధికారులను మేనేజ్ చేసి ఎవరు తెలియకున్నప్పటికీ బినామీ పేర్లపై వారికి పట్టాలిచ్చారని కూడా ఆరోపించారు. ఓ ప్రభుత్వ అధికారి, ఓ కానిస్టేబుల్ ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారంటే ఆ ప్రభుత్వంలో అవినీతి ఎంత దారుణంగా ఉందో మీకే తెలుస్తుంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల నంద్యాల పర్యటనకు వచ్చినప్పుడు నీతిమాటలు వల్లించటమే కాకుండా లాండ్ ఆర్డర్ దెబ్బతిందని అన్నారు. గత ఐదేళ్లలో ఆయన ప్రభుత్వంలో ఏం జరిగిందో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎండోమెంట్ భూములను చెరువులను కుంటలను కూడా వదలకుండా అక్రమించుకున్నాడని ఆరోపించారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఇంత మందిని మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కృషి చేస్తానన్నారు. ఇలాంటి ఆక్రమణలకు పాల్పడిన వారికి న్యాయం చేస్తామని, ఆ హామీ మేరకు పేద ప్రజలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అని ఆమే పేర్కొన్న రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement