Wednesday, November 20, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌.. 10 గేట్లు ఎత్తివేత‌..

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 3,02,583 క్యూసెక్కులు నీరు వస్తుండగా దిగువకు 3,79,232 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement