Friday, November 22, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు త‌గ్గిన వరద ఉధృతి..

శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో: 2,77,589 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో: 2,57,262 క్యూసెక్కులుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుతం: 884.30 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు. అయితే ప్రస్తుతం: 211.4759 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement