Monday, November 18, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. 9 గేట్లు ఎత్తివేత‌

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 9 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 2,69,288 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,14,034 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885, ప్రస్తుతం 884.80 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటినిల్వ 215 టీఎంసీలు, ప్రస్తుతం 214 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement