- అనుమతులు లేకుండా కోవిడ్ రోగులకు చికిత్స.
- ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి.
*రోగుల బంధువులకు ఫిర్యాదుతో వెలుగులోకి.
*విచారణ నిర్వహించి నిజమేనని తేల్చిన డీఎంహెచ్వో
*ఆసుపత్రి సీజ్ కు నిర్ణయం.
కర్నూల్ బ్యూరో, – కర్నూలు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ దాష్టీకం మరొకటి వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచి కోవీడు అనుమతులు పొందకుండానే కె ఎస్ కేర్ సెంటర్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తుంది. రోగుల నుంచి లక్షలకు లక్షలు బిల్లులు దండు కుంటూ వచ్చారు. అయితే హాస్పటల్లో ఆక్సిజన్ వ్యవస్థ లోపాలవల్ల ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో కంగుతిన్న కె ఎస్ కేర్ సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం.. రోగుల బంధువులతో బేరసారాలు వచ్చింది. ఈలోగా విషయం బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున మీడియా అక్కడ దిగి పోయింది. దీంతో చేతులెత్తేసిన కె ఎస్ కె ర్ సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం అక్కడి నుంచి మాయం కాగా, విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామ గిడ్డయ్య కె ఎస్ కేర్ సెంటర్ కి చేరుకొని వాస్తవాలను విచారించారు. అయితే ఎటువంటి అనుమతులు పొందకుండా కె ఎస్ కెర్ సెంటర్ యాజమాన్యం కొవిద్ రోగులకు చికిత్స అందిస్తున్న వైనం బహిర్గతం కావడంతో మృతుల బంధువులతో ఫిర్యాది తీసుకున్న కర్నూల్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కె ఎస్ కేర్ సెంటర్ యాజమాన్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని సీజ్ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామ గిడ్డయ్య వెల్లడించారు. ఇంతకు మునుపే కర్నూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న గాయత్రి హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేసిన సంగతి విదితమే. హాస్పిటల్ ఎండి ని అరెస్టు చేసి ఇ రిమాండ్ కు పంపారు. ఇంత జరిగినా కర్నూలు నగరంలో ధనమే దాహంగా ప్రైవేట్ ఆసుపత్రులు తీర్పు కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.