Friday, January 24, 2025

KNL | ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య..

కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా ,ఆలూరు మండలం అరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆలూరుకు చెందిన ఈరన్న (42) ఐదేళ్ల నుంచి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

అతడిని గత రెండు నెలలుగా రాజీనామా చేయాలని ఎవరో ఒత్తిడి చేస్తుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఈరన్న బైక్ పై వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో నరికి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ వెంకట చలపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement