Saturday, November 16, 2024

రైతే దేశానికి వెన్నెముక : మంత్రి జయరాం

ఆలూరు : కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులెబీడు గ్రామం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దాదాపు రూ.22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని సర్పంచ్ మంజుల, ఏడిఏ సునీత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 13 కోట్లు అందించమన్నారు. వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధితో 3000 కోట్లతో రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తున్నామని తెలిపారు. రైతులకు భరోసా కల్పించడానికి ఏ పంటల సీజనలో నష్టపోయిన రైతులకు ఆ ఆక్సిజన్ లోనే ఇన్సూరెన్స్ అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న పాలన స్వర్ణ యుగం లాగా పాలన సాగుతుందని తెలిపారు. రైతులకు సకాలంలో విత్తనాల అందజేస్తున్నమని తెలిపారు. జిల్లాలలో ఎరువుల కొరత లేదని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాలూకు ఇంచార్జ్ నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, జడ్పిటిసి ఏలూరు శేఖర్, వైస్ ఎంపీపీ భర్త శ్రీధర్, బెల్డోన సొసైటీ చైర్మన్ నిరంజన్ ప్రసాద్, కాంట్రాక్టర్ రఘునాథ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ తనయుడు వీరాంజనేయులు, మండల కన్వీనర్ వీరేష్, తుమ్మలబీడు సర్పంచ్ భర్త మల్లి, ముసనపల్లె సర్పంచ్ భర్త సోము ప్రభుత్వ అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement