నందికొట్కూరు : స్నేహితురాలికి ఎలాగైనా పరీక్షల్లో మంచి మార్కులు తెప్పించానే ఉద్దేశ్యంతో కిటికీ దగ్గర ఉన్న పరీక్ష పత్రాన్ని పరీక్ష రాసే సమయంలో పేపర్ ను ఎవరికీ తెలియకుండా కొందరు విద్యార్థిని మిత్రులు దొంగిలించారని పరీక్ష పత్రం బయటకు తెచ్చి జిరాక్స్ సెంటర్ దగ్గరకు వెళ్ళి కాపీలు వేయడానికి ప్రయత్నించిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డి ఎస్ పి శృతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ఏప్రిల్ 29వ తేదీన జరిగిన పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ కు సంబంధించి గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగలేదని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిందని తెలిపారు. ఇందులో నందికొట్కూరుకు చెందిన ఆవుల వసంత్ కుమార్ అతని మిత్రుడు ఆర్ల రాజు, నవీన్ కుమార్ రెడ్డి అనే ముగ్గురు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రూమ్ నెంబర్ 1 హాల్ నెంబర్ 8లో కిటికీ దగ్గరకు ఈ ముగ్గురు వెళ్ళి ఒక విద్యార్థి ప్రశ్న పత్రం కిటికీలో పెట్టుకొని ఏకాగ్రతతో పరీక్ష రాస్తుండగా పరీక్ష రాసే విద్యార్థికి తెలియకుండానే ప్రశ్నపత్రం తీసుకొని ఫోటో తీసి మళ్ళి అక్కడే కిటికీలో పెట్టి బయటకు వచ్చారని తెలిపారు. ఆ తరువాత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని కాపీలు వేసేందుకు శ్రీ నవనంది పాఠశాలల పీఈటీ సోమసుందర్ రెడ్డి దగ్గరకు ప్రశ్నపత్రాన్ని తీసుకెళ్లి తమ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులైన శ్రీధర్ సమాధానాలు చెబుతుండగా మరొక ఉపాధ్యాయులైన శేషన్న పరీక్ష పత్రానికి సమాధానాలు వ్రాసి ఇచ్చారని ఆ సమాధానాలను పట్టణంలోని కాలేజి రోడ్డులో ఉన్న అమీర్ బాషా జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్ చేసుకొని కాపీలు వేయడానికి ప్రయత్నించారని అందుకు కారణమైన ఏడుగురిలో 6 మందిని అరెస్ట్ చేశామని డిఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తులను జె ఎఫ్ సి ఎం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు పట్టణ సిఐ నాగరాజ రావు, ఎస్ఐ ఎన్ వి రమణ, సిబ్బంది పాల్గొన్నారు.
అరెస్ట్ అయిన ఆరుగురు ముద్దాయిలు వీరే :
ఏ 1 . వసంత్ కుమార్
ఏ 2. అర్ల రాజు
ఏ 3. దొరకలేదు
ఏ 4. సోమసుందర్ రెడ్డి
ఏ 5. శ్రీధర్
ఏ 6. శేషన్న
ఏ 7. అమీర్ బాషా
స్నేహితురాలి కోసమే పరీక్ష పత్రం బయటకు… ఆరుగురు అరెస్ట్ : ఆత్మకూరు డీఎస్పీ శృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement