Friday, November 22, 2024

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేవారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే శిల్పా అక్ర‌మాలు బ‌య‌ట పెడ‌తాన‌ని అఖిల ప్రియ తెలిపారు. నేడు నంద్యాల గాంధీచౌక్‌లో చర్చకు రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. చర్చకు అనుమతి లేదని.. అఖిల ప్రియ‌ ప్రైవేట్ కార్యదర్శికి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ నంద్యాలకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆళ్ల‌గ‌డ్డ‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement