Tuesday, October 15, 2024

AP | గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలి : ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

రుద్రవరం, ప్రభన్యూస్ : మండలంలోని గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని తద్వారా ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి అధ్యక్షతన ఎంపీడీవో రామచంద్ర ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.

సమావేశంలో మండల పరిధిలోని ఆయా శాఖల అధికారులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం తదితర అంశాలపై సభలో వివరించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ…. ఎన్నికల సందర్భంలోనే రాజకీయాల జోక్యం ఉంటుందని ప్రస్తుతం రాజకీయాలను పక్కనపెట్టి గ్రామాల అభివృద్ధి ప్రజాసంక్షేమం కొరకు పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని ఆమె కోరారు.

రుద్రవరం మండలంలో తెలుగుంగ ప్రధాన కాలువకు ఆళ్లగడ్డ నియోజకవర్గం లో కేసి కెనాల్ కు సాగునీరు విడుదల చేయడంతో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించినాయన ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగా రుద్రవరం మండలంలో అభివృద్ధి చేపట్టేందుకు రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

మండలంలోని గ్రామాలలో ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని తద్వారా వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సంబంధంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే ఎరువులు తదితర వాటిని రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం నుండి వచ్చే రైతు సంక్షేమ పథకాలు వాటిపై మీడియా ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు.

పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈఓకు సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత లోపిస్తే సంబంధిత వంట ఏజెన్సీ నిర్వాహకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించని వంట చేసి నిర్వాహకులు టిడిపి మద్దతుదారులైన సాయం చేయలేదని వారికి టిడిపి నాయకులు ఎవరైనా వెనుకేసుకొచ్చే ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

గ్రామాలలో రోడ్లు త్రాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. అధికారులు సిబ్బంది గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాడని వైసీపీ టిడిపి మరీ ఇతర పార్టీలు చెందిన వారు ఎవరైనా సరే అడ్డుపడకుండా అందరూ సహకరించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జరిగిందా లేదా అనేది అందరికీ తెలిసిన విషయమేనని గతం పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం కొరకు అందరూ తమ వంతుగా సహకరించాలన్నారు.

రానున్న రోజుల్లో రుద్రవరం మండలం తో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరు కృషి చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కొరకు సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆళ్లగడ్డ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. మండలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

రుద్రవరం మండలంలోని చిన్నకంబలూరు మెట్ట నుండి సిరివల్ల వెళ్లే మార్గమధ్యంలోని ఆర్ అండ్ బి రహదారి అధ్వానంగా ఉందని త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జి తహసిల్దార్ రవీంద్రప్రసాద్ ఆయా శాఖల మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement