ముగ్గురు చిన్నారులకు కరెంట్ షాక్ కొట్టిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోసిగిలో ముగ్గురు చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది.
మండల కేంద్రమైన కోసిగి మూడవ వార్డులో నివాసముంటున్న బుడిగె మాధవరెడ్డి తన సొంత ఇంటి నిర్మాణ పనుల్లో పాత మట్టిని తన సొంత ట్రాక్టర్ లో పారబోసేందుకు భూగెని చెరువుకు ట్రాక్టర్ ద్వారా మట్టిని తీసుకెళ్లాడు.. ట్రాక్టరు వెంబడి తమ ఇద్దరు కుమారులతో పాటు, తన చెల్లి కొడుకు ట్రాక్టర్ వెంబడి వెళ్లారు. ట్రాక్టర్ లో ఉండే మట్టిని లిఫ్ట్ ద్వారా కింద పారబోసే క్రమంలో ట్రాక్టర్ పై ఉండే కుమారులను గమనించలేదు. ట్రాక్టర్ కు పైన విద్యుత్ తీగలు తగలడంతో మల్లికార్జున, అనుమేష్, చిన్న, ముగ్గురు విద్యార్థులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గురయ్యారు. వెంటనే గమనించి ట్రాక్టర్ లిఫ్ట్ కిందకు దించేసి ఆ పిల్లలను బంధువుల సహకారంతో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ విద్యార్థులకు వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. తమ పిల్లలు విద్యుత్ షాక్ కు గురవడంతో బంధువులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి భారీగా తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు.