కర్నూలు – రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్. కర్నూల్ నగరంలోని స్థానిక కేకే భవనంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాల లు భారీగా పెరిగాయని, వాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించినట్టు 35 వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ ని విడుదల చేయాలని ఆ విధంగా చేస్తేనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలు నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించగలుగుతాయి అని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం తోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు చదువు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏకోపాధ్యాయ పాఠశాల దగ్గర కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా ఉన్నప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం వారి కి నైపుణ్యంతో కూడుకున్న విద్య అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర తాహెర్ వలి, జిల్లా సహాయ కార్యదర్శులు వీరేష్, చంద్ర పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement