Sunday, November 17, 2024

డా.చంద్రశేఖర్​ కు ‘వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​’ సర్టిఫికెట్ ఆఫ్ కమిట్ మెంట్ అవార్డు

కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్ది… రెండు దశాబ్దాలుగా వేలాది రోగులకు వైద్యసేవలు అందించిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు డా.చంద్రశేఖర్​ను లండన్​కు చెందిన ‘వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​’ సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డు వరించింది. ఈ విషయం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ జాయింట్ సెక్రెటరీ ఎలియాజర్ స్వయంగా ప్రకటించారు.

కోవిడ్​ ఫస్ట్​ వేవ్​లో రోగులకు అండగా నిలబడుతూ.. వైద్యసేవలతో వారి ప్రాణాలకు భరోసాగా నిలిచిన గుండె వైద్యనిపుణులు డా.చంద్రశేఖర్​ సేవలు అద్వితీయమని ప్రశంసించారు జాయింట్ సెక్రెటరీ ఎలియాజర్. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కార్డిలయాలజీ విభాగం కాన్ఫరెన్స్​ హాల్​ సంస్థ జాయింట్ సెక్రెటరీ, సౌత్ ఇండియా ఇన్ ఛార్జి ఎలియాజర్ ఆధ్వర్యంలో డా.చంద్రశేఖర్​కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేయున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement