కర్నూలు : విధులకు ఏ సమయంకి రావాలో తెలియదా అంటూ శానిటేషన్ అధికారులపై మేయర్ బీవై రామయ్య అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున 5,1,8వ డివిజన్లలో వివిధ ప్రాంతాల్లో మేయర్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా 5వ డివిజన్ బుధవారం పేటలో 33వ సచివాలయం వద్ద మస్టర్ పాయింట్ వద్దకు వెళ్లి, అక్కడ ఎవరూ లేకపోవడంతో శానిటేషన్ ఇంస్పెక్టర్, సెక్రటరీలకు కాల్ చేయగా, లిఫ్ట్ చేయలేదు. కాసేపటి తర్వాత సెక్రటరీ రాగా 45 నిమిషాలు పాటు కార్మికులు హాజరే తీసుకోకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సెక్రటరీపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. తర్వాత అక్కడికి చేరుకున్న మేస్త్రిని, తన పరిధిలో కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారని అడగగా మేస్త్రి నుంచి సమాధానం లేకపోవడంతో కార్మికులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా విధులు నిర్వహిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. సచివాలయం లోపల హాజరు తీసుకుంటారని, అది ఇంకా తెరవకపోవడంతో బయట ఉన్నామని కార్మికులు చెప్పడంతో ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేసి ఇలా మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలన్నారు. తర్వాత మారెమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ సెక్రటరీ ప్రతిరోజూ ఆలస్యం వస్తాడని ఇన్ స్పెక్టర్ చెప్పగా, దాన్ని మేయర్ రాతపూర్వకంగా రాసి ఇవ్వమన్నారు. దీంతో సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని ఎం.హెచ్.ఓ.కి ఆదేశించారు. 1వ డివిజన్ లో అంబేద్కర్ సర్కిల్, చితంబరావు వీధి, కండేరి ప్రాంతాల్లో మేయర్ విస్తృతంగా పర్యటించి శానిటేషన్ పనులు పరిశీలించారు. 8వ డివిజన్ లో కొత్తపేట రైతు బజార్ లోకి వెళ్లి అక్కడ ప్లాస్టిక్ వాడకంపై ఆరా తీశారు. వాటి నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే సంకల్ బాగ్ పార్కులో జిమ్ పరికరాలు పరిశీలించారు. అవి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరగా వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, సమస్య పరిష్కారించాని ఆదేశించారు. తర్వాత రోజా దర్గా, నదీ వెంబడి పరిశీలించారు. పుష్కర ఘాట్ లో వినాయకుని విగ్రహాలు మెట్లపై అలాగే ఉండటంతో వెంటనే వాటిని నదిలోకి వదిలేయాలని ఆదేశించారు. తనిఖీల్లో కార్పొరేటర్లు సోంపల్లి కృష్ణాకాంత్ రెడ్డి, షాషావలి, శానిటేషన్ ఇన్ స్పెక్టర్ రమేష్, మునిస్వామి తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement