Tuesday, November 26, 2024

దిశ పెట్రోలింగ్ వాహనాలతో మహిళల భద్రతకు భరోసా . .

కర్నూలు – మహిళల భద్రత, సంరక్షణకు ప్రభుత్వంతో పాటు పోలీసుశాఖలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. మహిళల రక్షణార్ధం పని చేస్తున్న దిశా పెట్రోలింగ్ లో విధులు నిర్వహించే మహిళా పోలీసులకు ప్రత్యేకంగా 60 ద్విచక్ర వాహనాలు, 1 దిశ మినీ వ్యాన్ , 2 “హై అలెర్ట్ వైర్లెస్ కమాండ్” తుఫాన్ వాహనాలను ముఖ్యమంత్రి జ‌గ‌న్ డిజిపి చొరవతో కర్నూలు జిల్లా కు కేటాయించారన్నారు. ఈ వాహ‌నాల‌ను కొండాబురుజు దగ్గర జెండా ఊపి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, మహిళల భద్రత, రక్షణ కోసం 60 దిశా పెట్రోలింగ్ ద్వి చక్ర వాహనాలను, 1 మిని బస్సు, 2 “హై అలెర్ట్ వైర్లెస్ కమాండ్” తుఫాన్ వాహనాలు జిల్లాలోని 60 పోలీసుస్టేషన్ ల పరిధులలో సంచ‌రిస్తూ మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయ‌న్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలు, కళాశాలల దగ్గర ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వేధింపులు కట్టడి దిశా గా మహిళా పోలీసులు పనిచేస్తారన్నారు. దిశా మిని బస్సులో అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులను సంరక్షించుటలో భాగంగా నేర స్థలానికి చేరి వారికి సత్వర ఉపశమన చర్యలు చేపట్టడం కోసం మినీ బస్ ను కూడా దిశ పోలీసు స్టేషన్ కు కేటాయించటం జరిగిందన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక బృందంగా ఘటనా స్థలానికి మినీ వ్యాన్ లో వెళ్లనున్నారు. త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తీ చేయడం కోసం బాధితురాలి ఇంటి వద్ధకే వెళ్లి గోప్యత విషయాలను బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఘటనా స్థలంలోని ఆధారాలను సమగ్రంగా సేకరించి భద్రపరిచేందుకు ప్రత్యేక కిట్స్ ఈ మినీ వ్యాన్ లో ఉంటాయన్నారు. మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించడం వంటి చర్యలు చేపడతారన్నారు. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ తో రక్షణ పొందే విధంగా విస్తృతంగా అవగాహన చేస్తున్నారన్నారు. దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాల వల్ల మహిళల భద్రతకు భరోసా కల్పించనున్నాము. 2 “హై అలెర్ట్ వైర్లెస్ కమాండ్” (HAWK) తుఫాన్ వాహనాలను కూడా కర్నూలు జిల్లాకు కేటాయించటం జరిగింద‌ని,. వాటిలో ఒకటి జిల్లా కేంద్రంలో, రెండవది జిల్లాలో ఎక్కడైతే అత్యవసర పరిస్థితి వస్తుందో అక్కడ వినియోగించుటకు కేటాయిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి , ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ , డిఎస్పీలు వెంకట్రామయ్య, మహేశ్వరరెడ్డి, కెవి మహేష్, మహబూబ్ భాషా, ఈ కాప్స్ రాఘవరెడ్డి, సిఐలు, ఎస్‌ఐలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement