రొంపిచెర్ల, (ప్రభ న్యూస్): పెళ్లి పీటల మీద నుండి నవవరుడు నేరుగా వచ్చి పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకున్న సంఘటన రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి… రొంపిచెర్ల మండలం, చెంచమరెడ్డి గారి పల్లికి చెందిన లవకుమార్ కు సోమవారం ఉదయం 9 గంటలకు స్థానిక టీటీడీ కల్యాణ మండపం లో వివాహం జరిగింది. అయితే కాణిపాకం ఆలయంలో 12 గంటలకు వధూవరులు ఇరువురు కలిసి పూజ చేసుకునేందుకు నమోదు చేసుకున్నారు.
సమయం తక్కువగా ఉండటంతో వివాహం అయిన వెంటనే వరుడు టీటీడీ కల్యాణ మండపం నుండి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటును వినియోగించుకున్నారు.అతను తిరుపతిలోని రిలయన్స్ స్టోర్ లో పని చేస్తూ వున్నారు. పెళ్లి బట్టలలో వున్న వరుడు చూసి ఓటర్లు అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు.