Friday, November 22, 2024

భారీగా డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

కర్నూలు బ్యూరో – గూడూరు మండలం, నాగలాపురం పరిధిలో శనివారం భారీగా మందుగుండు సామాగ్రి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు టౌన్ డి.యస్.పి. కేవి.మహేశ్ వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. , కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం.శ్రీనాథ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కె.నాగలపురం పోలీసు స్టేషన్ యస్.ఐ. యం.కేశవ వారి సిబ్బంది కలసి ఉదయం 10.30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఉలింద కొండకు చెందిన రామ నాయుడు అనే వ్యక్తి ఎలాంటి లైసెన్సు, అనుమతులు లేకుండా ప్రేలుడు పదార్థములు ఆటోలో తరలిస్తున్న విషయాన్ని గుర్తించారు. తక్షణమే ఆ ఆ వ్యక్తి ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 782 జిలిటెన్ స్టిక్స్ , 800 డిటోనేటర్లు తో పాటు (AP21TC1831) అటో ను స్వాధీనం చేసుకున్నారు. ఆలూరులోని పొలంలో ఉన్నకొండ‌రాళ్ల బ్లాసింగ్ కోసం అదే గ్రామానికి చెందిన అనుముల శ్రీనివాస్ నుంచి కొనుగోలు చేసిన‌ట్లు రామానాయుడు తెలిపాడు.ఈ ప్రేలుడు పదార్ధాలను పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించిన కె.నాగలపురం పి.యస్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అసుదుల్లా ఖాన్ ,పోలీస్ కానిస్టేబుల్ యం.మంజు కుమార్ లను కర్నూలు టౌన్ డి.యస్.పి మహేశ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement