గుర్తు తెలియని వ్యక్తులు జింకలను చంపేయడంతో జింకల కళేబరాలు బయటపడిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చిచంపారు. ఆదోని మండలం నారాయణపురం వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదోని సరిహద్దు చెక్‌పోస్టులను అధికారులు అప్రమత్తం చేశారు. నిందితులు కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital