ఆస్పరి: ఆస్పరి మండల పరిధిలోని డీ కోటకొండ గ్రామానికి డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్యకు రూ.10 లక్షలు, బి పత్తికొండ గ్రామానికి రూ.5 లక్షలు, గార్లపెంట గ్రామానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలియజేశారు. శుక్రవారం డీ కోటకొండ గ్రామంలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాం, వైఎస్ఆర్సిపీ ఆలూరు తాలుక ఇన్ చార్జి గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు. గ్రామ సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. చిన్న పిండేకల్ నుండి డి కోటకొండ ఈ గ్రామానికి తారు రోడ్డు వేయడానికి రూ.42.51లక్షలు టెండర్ కూడా అయిపోయిందని, ఈ గ్రామానికి ప్రభుత్వ పథకాలకు రూ.4,55,92,383 ఖర్చు చేసిందని ఈ గ్రామంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపీ నాయకులు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement