నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో రాముడు(58), సుభద్రమ్మ (50) అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే దంపతులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త రాముడు మృతి చెందగా… భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కుటుంబ కలహాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement