Thursday, November 21, 2024

AP | కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో కార్డెన్ సెర్చ్..

కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూల్ డీఎస్పీ జె.బాబు ప్రసాద్ పర్యవేక్షణలో ఇవాళ ఉద‌యం కర్నూలు నాల్గవ పట్టణ సీఐ మధుసూధన్ గౌడ్ ఆధ్వర్యంలో కర్నూల్ వీకర్ సెక్షన్ కాలనీలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈకార్య‌క్ర‌మంలో ఆరుగురు సీఐలు, 5మంది ఎస్సైలు, 75మంది పోలీసులు పాల్గొన్నారు.

రౌడీషీటర్లు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్ళల్లో దాడులు నిర్వహించారు. వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో మెలగాలని తెలియజేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే అటువంటి వారి సమాచారాన్ని అందించండి. తగిన పారితోషికం ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు తెలిపారు.


కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 15 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు మధుసూధన్ గౌడ్, ప్రవీణ్ కుమార్, నాగరాజరావు, పవన్ కుమార్, పార్థసారథి రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement